Tuesday, October 22, 2024
Homeజాతీయంభార‌త‌ ప్ర‌ధాని మోడీ డిగ్రీపై వ్యాఖ్య‌లు..

భార‌త‌ ప్ర‌ధాని మోడీ డిగ్రీపై వ్యాఖ్య‌లు..

Date:

భార‌త ప్ర‌ధాని మోడీ డిగ్రీ విద్యార్థుల‌పై న‌మోదు అయిన కేసులో.. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్‌కు సోమ‌వారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్ర‌ధాని డిగ్రీపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఆయ‌న‌పై గుజ‌రాత్ యూనివ‌ర్సిటీ ప‌రువున‌ష్టం కేసును దాఖ‌లు చేశారు. ఆ కేసులో ట్ర‌య‌ల్ కోర్టు స‌మ‌న్లు జారీ చేశారు. ఆ స‌మ‌న్ల‌ను కొట్టివేయాల‌ని కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్ర‌యించారు. అయితే ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశాల‌ను కొట్టివేసేందుకు సుప్రీం నిరాక‌రించింది.

జ‌స్టిస్ హృషికేశ్ రాయ్‌, ఎస్‌వీఎన్ భ‌ట్టిల‌తో కూడిన ధర్మాస‌నం ఈ కేసును విచారించింది. గ‌తంలో ఇదే కేసులో ఆప్ నేత సంజ‌య్ సింగ్ వేసిన పిటీష‌న్‌ను కొట్టివేసిన‌ట్లు సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అయితే కేజ్రీవాల్ త‌ర‌పున సీనియ‌ర్‌ న్యాయ‌వాది అభిషేక్ మ‌నూ సింఘ్వీ వాదించారు. సంజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు భిన్న‌మైన‌వి ఆయ‌న కోర్టుకు చెప్పారు. కానీ ఆ పిల్‌ను విచారించేందుకు కోర్టు నిరాక‌రించింది. సంజ‌య్ సింగ్‌పై కూడా గుజ‌రాత్ వ‌ర్సిటీ కేసు బుక్ చేసింద‌ని, ఈ కేసులో ఒక‌విధ‌మైన ఆదేశాలు ఉండాల‌ని, అందుకే కేజ్రీవాల్ పిటీష‌న్‌ను స్వీక‌రించ‌డం లేద‌ని, దాన్ని డిస్మిస్ చేస్తున్నామ‌ని కోర్టు చెప్పింది.