Thursday, December 26, 2024
Homeజాతీయంబాలుడి కడుపులో 56 ఇనుప వ‌స్తువులు

బాలుడి కడుపులో 56 ఇనుప వ‌స్తువులు

Date:

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 15 ఏళ్ల బాలుడు అరుదైన, తీవ్రమైన వ్యాధితో పోరాడుతూ చివరికి తుది శ్వాస విడిచాడు. ఆదిత్య శర్మ అనే 15 ఏళ్ల బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. కొన్ని నెలల క్రితం తనకు బాగా కడుపు నొప్పి వస్తోందని, శ్వాస తీసుకోలేకపోతున్నానని తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే వాళ్లు ఆదిత్యను హత్రాస్‌లోని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు జైపూర్‌లోని ఆసుపత్రిలో చేర్చాలని సలహా ఇచ్చారు. జైపూర్‌లో కొంతకాలం చికిత్స తీసుకున్న తర్వాత ఆదిత్యను డిశ్చార్జ్ చేశారు. కానీ, కొద్ది రోజులకే అతనికి మళ్లీ అదే లక్షణాలు కనిపించాయి.

జైపూర్ నుంచి ఆదిత్యను అలీఘర్‌లోని హాస్పిటల్‌కి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో, వైద్యులు సర్జరీ చేశారు. అక్టోబర్ 26న చేసిన అల్ట్రాసౌండ్‌ టెస్ట్‌లో అతని శరీరంలో దాదాపు 19 వస్తువులు ఉన్నట్లు తేలింది. దీంతో డాక్టర్లు నోయిడాలోని మంచి ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. నోయిడాలో మరో స్కాన్ చేయించగా, ఆదిత్య కడుపులో 56 లోహపు ముక్కలు ఉన్నట్లు తెలిసింది. దీంతో అతన్ని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ అక్టోబర్ 27న సర్జరీ చేశారని బాలుడి పేరెంట్స్ తెలిపారు. సర్జరీలో బాలుడి కడుపు నుంచి వాచ్ బ్యాటరీలు, బ్లేడ్లు, మేకులతో సహా మొత్తంగా 56 లోహపు వస్తువులను తొలగించారు. అయితే, సర్జరీ చేసిన మరుసటి రోజే ఆ బాలుడు మరణించాడు.