Wednesday, December 25, 2024
Homeజాతీయంప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో బెనెగ‌ల్ అంత్య‌క్రియ‌లు

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో బెనెగ‌ల్ అంత్య‌క్రియ‌లు

Date:

ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ అంత్యక్రియలు ముగిశాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శివాజీ పార్క్‌ ఎలక్ట్రిక్‌ క్రిమటేరియంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో బెనెగల్‌ అంత్యక్రియలు నిర్వహించారు. శ్యామ్‌ బెనెగల్‌ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు భారీ సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. శ్యామ్‌ బెనెగల్‌ కిడ్నీ సంబంధ అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మరణించారు.

1934లో హైద‌రాబాద్ రాష్ట్రంలోని తిరుమ‌ల‌గిరి ప్రాంతంలో శ్యామ్ బెనెగ‌ల్ జ‌న్మించారు. సినీ రంగానికి అందించిన సేవలకుగాను ఆయన ప‌ద్మ శ్రీ, ప‌ద్మభూష‌ణ్‌, దాదా సాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డుల‌ను అందుకున్నారు. శ్యామ్‌ బెనెగల్‌ సికింద్రాబాద్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చ‌దివారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ ఎక‌నామిక్స్ ప‌ట్టా పొందారు. సామాజిక స‌మ‌స్యలు, ఆర్థిక అస‌మాన‌త‌ల‌పై ఆయ‌న సినిమాలు రూపొందించారు. ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. శ్యామ్ బెనెగ‌ల్‌కు అంకూర్ (1974), నిషాంత్ (1975), మంత‌న్ (1976), భూమిక ‌(1977), జునూన్ (1978) సినిమాలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఆయన జ‌బ‌ర్‌ద‌స్త్ డాక్యుమెంట‌రీని రూపొందించారు. జాతీయ సినిమా అవార్డులలో హిందీ కేటగిరీలో శ్యామ్‌ బెనెగల్‌ ఏకంగా ఏడుసార్లు అత్యుత్తమ సినిమా అవార్డులు అందుకున్నారు.