Saturday, December 21, 2024
Homeజాతీయంప్రధాని మోడీ ఇంటికి దీపజ్యోతి..

ప్రధాని మోడీ ఇంటికి దీపజ్యోతి..

Date:

మ‌న దేశంలో గోవును గోమాతగా పూజిస్తారు. ఆవులను పూజించడం మనం చూస్తూనే ఉన్నాం. భూమిపై మానవ మనుగడ ఎర్పడినప్పటి నుంచి మనుషులకు అన్ని విధాలుగా ఆవులు సహాయం చేస్తున్నాయి. సింధు నాగరికతలో భారతీయులు మొదటిగా స్నేహం చేసింది కుక్క, గోవు, గుర్రం, కోళ్లతోనే అని చరిత్ర చెబుతోంది. ఇలా గోవులు మన జీవితంలో భాగమైపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీకి గోవులంటే చాలా ఇష్టం. తాజాగా ఆయన ఇంటి గోవు ఓ దూడకు జన్మనిచ్చింది. దానికి దీప జ్యోతి అనే పేరు పెట్టారు.

ప్రధాని మోడీ ఇల్లు ఢిల్లీలోని లోక కళ్యాణ మార్గంలో ఉంది. అక్కడ తల్లి ఆవు.. దూడకు జన్మనిచ్చింది. వినాయక నవరాత్రుల సమయంలో ఈ దూడ పుట్టడం గొప్ప విషయంగా చెబుతున్నారు. శనివారం దీప జ్యోతిని ఇంట్లోకి ఆహ్వానించిన మోదీ.. తమ కుటుంబం లోకి కొత్త మెంబర్ వచ్చినట్లు తెలిపారు. ఆవు… అన్ని రకాలుగా ఆనందాన్ని తెస్తుంది. ఈ దూడ తలపై కాంతి ఆకారంలో ఒక మార్క్ ఉంది. అందుకే ఈ దూడకు దీప జ్యోతి అనే పేరు పెట్టినట్లు ప్రధాని మోదీ తెలిపారు. దీప జ్యోతి చాలా అందంగా ఉందనీ, చూడ ముచ్చటగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆ లేగదూడతో ఆయన పూజ చేశారు. దానికి ముద్దు పెట్టారు.