Thursday, December 26, 2024
Homeజాతీయంపెళ్లి దుస్తుల్లో వ‌చ్చి ఓటేసిన పెళ్లికూతురు

పెళ్లి దుస్తుల్లో వ‌చ్చి ఓటేసిన పెళ్లికూతురు

Date:

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా, మ‌రికొన్ని ప్రాంతాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. కాని దేశంలోని ప్ర‌ధాన నగరాల్లో చాలా మంది ఓటును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉన్నతవిద్యను అభ్యసించిన వారిలో కూడా కొందరు ఓటును పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వాళ్లకు ఖుషి అనే ఓ పెళ్లి కూతురు ఓటు విలువను గుర్తుచేసింది. తనదే పెళ్లి జరుగుతున్నా, పెళ్లి వేడుకలు కొనసాగుతున్నా ఖుషి తన బాధ్యతను మరువలేదు. ఇళ్లంతా బంధుమిత్రుల సందడితో ఉన్నా ఆ ఏముందిలే అని అనుకోకుండా ఆమె పోలింగ్‌ బూత్‌కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజస్థాన్‌లోని దౌసా అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓటు అనేది చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖుషి సూచించారు.

జార్ఖండ్‌ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తోపాటే రాజస్థాన్‌లోని దౌసా అసెంబ్లీ స్థానానికి బుధవారం ఉప ఎన్నికల పోలింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఓటరైన పెళ్లి కూతురు ఖుషి పెళ్లి దుస్తుల్లోనే వ‌చ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.