Wednesday, January 15, 2025
HomeUncategorizedపారాలింపిక్స్‌లో భార‌త్‌కు ప‌త‌కాల పంట‌

పారాలింపిక్స్‌లో భార‌త్‌కు ప‌త‌కాల పంట‌

Date:

పారాలింపిక్స్‌లో భార‌త్ ప‌త‌కాల పంట పండించింది. పారిస్ వేదికగా ఆగస్టు 28న మొదలై సెప్టెంబ‌ర్ 08తో ముగిశాయి. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించిన భారత్, ఈ సారి 25 పతకాలపై గురిపెట్టింది. మొత్తం 84 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. మన అథ్లెట్లు అంచనాలను మించి అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత్‌ రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించింది. ఇందులో అత్యధిక మెడల్స్‌ అథ్లెటిక్స్‌లోనే రావడం విశేషం. ఈ విభాగంలో నాలుగు స్వర్ణాలు సహా 17 పతకాలు వచ్చాయి. ఓవరాల్‌గా ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో 18వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ అత్యధిక పతకాలు సాధించడం ఇదే తొలిసారి. స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, బెల్జియం, అర్జెంటీనా వంటి దేశాలను వెనక్కినెట్టి టాప్‌-20లో నిలిచింది.

పతకాలు సాధించిన అథ్లెట్లు

1) అవని లేఖరా – స్వర్ణం (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్ SH1)
2) మోనా అగర్వాల్ – కాంస్యం (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్ SH1)
3) ప్రీతి పాల్ – కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 100మీ T35
4) మనీశ్‌ నర్వాల్ – రజతం (షూటింగ్) పురుషుల ఎయిర్‌ పిస్టల్ SH1
5) రుబీనా ఫ్రాన్సిస్‌ – కాంస్యం (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌పిస్టల్ SH1
6) ప్రీతి పాల్ – కాంస్యం (అథ్లెటిక్స్‌) మహిళల 200మీ T35
7) నిషాద్ కుమార్ – రజతం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ T47
8) యోగేశ్ కతునియా – రజతం (అథ్లెటిక్స్‌) పురుషుల డిస్కస్ త్రో F56
9) నితేష్ కుమార్ – స్వర్ణం (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ SL3
10) తులసిమతి మురుగేశన్ – రజతం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SU5
11) మనీశా రామదాస్ – కాంస్యం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SU5
12) సుహాస్ యతిరాజ్ – రజతం (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ SL4
13) రాకేశ్‌ కుమార్/శీతల్ దేవి – కాంస్యం (ఆర్చరీ) ఆర మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్
14) సుమిత్‌ అంటిల్‌ – స్వర్ణం (అథ్లెటిక్స్) జావెలిన్ త్రో ఎఫ్64
15) నిత్య శ్రీ శివన్ – కాంస్యం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SH6
16) దీప్తి జీవాంజీ – కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 400 మీటర్ల టీ20
17) శరద్ కుమార్ – రజతం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ63 (అథ్లెటిక్స్)
18) మరియప్పన్ తంగవేలు – కాంస్యం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ63
19) అర్జీత్‌ సింగ్‌ – రజతం (అథ్లెటిక్స్‌) పురుషుల జావెలిన్ త్రో F46
20) గుర్జర్‌ సుందర్‌ సింగ్‌ – కాంస్యం (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో F46
21) సచిన్‌ ఖిలారీ – రజతం (అథ్లెటిక్స్) పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46
22) హర్విందర్ సింగ్ – స్వర్ణం (ఆర్చరీ) పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్
23) ధరంబీర్ సింగ్ – స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51
24) ప్రణవ్ – రజతం (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51
25) కపిల్ పర్మార్ – కాంస్యం (జూడో) పురుషుల -60 కేజీల జే1
26) ప్రవీణ్ కుమార్ – స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ T64
27) హొకాటో హొటోజి సెమా – కాంస్యం (అథ్లెటిక్స్‌) పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57
28) సిమ్రాన్ – కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 200 మీటర్ల టీ12
29) నవదీప్ సింగ్ – స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో F41