దేశంలో గడిచిన మూడేళ్లలో అటవీ విస్తీర్ణం సుమారు 1445 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు తాజా రిపోర్టు పేర్కొన్నది. దీంతో దేశంలో మొత్తం గ్రీనరీ ఏరియా 25.17 శాతానికి చేరుకున్నట్లు ప్రభుత్వ డేటా తెలిపింది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్(ఐఎస్ఎఫ్ఆర్) ను శనివారం రిలీజ్ చేశారు. కార్బన్ వ్యర్థాలను 2.29 బిలియన్ టన్నులు తగ్గించినట్లు ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్టులో పేర్కొన్నారు. అదనంగా మరో మూడు బిలియన్ల టన్నుల కార్బన్ను 2030 నాటికి తగ్గించేందుకు ప్లాన్ చేసినట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. 2021లో 7,13,789 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం .. 2023లో 7,15,343 చదరపు కిలోమీటర్లు పెరిగిందని నివేదికలో తెలిపారు. చెట్ల విస్తీర్ణం 1289 కిలోమీటర్ల పెరిగినట్లు నివేదికలో చెప్పారు.