Wednesday, October 30, 2024
Homeజాతీయందీపావ‌ళి అంటే ప‌టాసుల పండుగ కాదు

దీపావ‌ళి అంటే ప‌టాసుల పండుగ కాదు

Date:

దీపావ‌ళి అంటే ప‌టాసులు కాల్చే పండుగ కాదు దీపాలు వెలిగించి జ‌రుపుకునే పండుగ అని ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఈ పండుగ సందర్భంగా ఎవరూ పటాసులు కాల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఆయన చెప్పారు. పటాకులు కాల్చవద్దని, దీపాలు వెలిగించాలని సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెబుతున్నాయని ఆయన గుర్తుచేశారు.

‘పర్యావరణం పాడవుతుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా పటాసులు కాల్చవద్దని, దీపాలు వెలిగించాలని సూచిస్తున్నాయి. ఇది దీపాలు వెలిగించే పండుగ, పటాసుల పండుగ కాదు. పటాసులు కాల్చవద్దని చెప్పడం అంటే ఎవరికో అనుకూలంగా మాట్లాడినట్టు కాదు. కాలుష్యం పెరిగితే మన పిల్లల ఆరోగ్యాలు చెడిపోతాయి. ఇందులో హిందూ, ముస్లిం ఆలోచన లేదు. ప్రతి ఒక్కరికీ వారి జీవితం ముఖ్యం’ అని అర్వింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.