తమిళనాడు రాష్ట్రంలో సుమారు వెయ్యి కోట్ల సైబర్ మోసం జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించిన తనిఖీలు పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బెంగాల్‌లోని 8 ప్రదేశాల్లో సోదాలు చేపడుతున్నారు. కోల్‌కతాలో పార్క్ స్ట్రీట్, సాల్ట్ లేక్, బగుహతి ఏరియాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. మరో జిల్లాలోని మూడు ప్రదేశాల్లో సోదాలు చేపడుతున్నారు. సాల్ట్ లేక్ ఏరియాలో ఇవాళ జరిగిన తనిఖీల్లో.. ఈడీ అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బగుహతి ఏరియాలో ఉన్న ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో తనిఖీలు జరుగుతున్నట్లు ఈడీ అధికారి తెలిపారు. ఈశాన్య భారత్‌కు చెందిన పలు రాష్ట్రాల వ్యక్తులు ఈ క్రైంలో పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.