Wednesday, January 8, 2025
Homeజాతీయంత‌మిళ‌నాడులో బీభ‌త్సం సృష్టిస్తున్న ఫెంగ‌ల్ తుఫాన్‌

త‌మిళ‌నాడులో బీభ‌త్సం సృష్టిస్తున్న ఫెంగ‌ల్ తుఫాన్‌

Date:

త‌మిళ‌నాడు రాష్ట్రంలో తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్‌ వాటిపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలు, వరదలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా దారుణంగా దెబ్బతిన్నది. ఉత్తంగిరిలో ఆదివారం రాత్రి అత్యధిక వర్షపాతం నమోదైంది. 14 గంటలకు పైగా భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఉత్తంగిరి బస్టాండ్‌లోని పలు బస్సులు, కార్లు వరద ప్రవాహానికి కొట్టుకెళ్లాయి. రోడ్డు దిగువన వరదల్లో అవి చిక్కుకున్నాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

తమిళనాడు వ్యాప్తంగా ఏడు వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం ఎంకే స్టాలిన్‌ తెలిపారు. 147 శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరిలోని వరద ప్రాంతాల్లో చిక్కుకున్న జనాన్ని తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పుదుచ్చేరి, కృష్ణా నగర్‌లోని కొన్ని ప్రాంతాలలో నీటి మట్టం దాదాపు ఐదు అడుగులకు పెరిగింది. దీంతో సుమారు 500 ఇళ్లల్లోని నివాసితులు వరదల్లో చిక్కుకున్నారు. వీరిలో 100 మందికి పైగా వ్యక్తులను ఆర్మీ రక్షించిందని అధికారులు తెలిపారు.