Thursday, December 26, 2024
Homeజాతీయంత‌న‌ను జైల్లోనే చంపేందుకు కుట్ర ప‌న్నారు..

త‌న‌ను జైల్లోనే చంపేందుకు కుట్ర ప‌న్నారు..

Date:

జైల్లో ఉన్న తనకు ఇన్సులిన్‌ ఇవ్వకుండా త‌న‌ను చంపేందుకు భాజపా కుట్ర పన్నిందని అరవింద్ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం జనసంపర్క్‌ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. అయితే తిహాడ్‌ జైలు అధికారవర్గాలు ఈ ఆరోపణలను ఖండించాయి. ఆయనకు అన్ని వైద్యసౌకర్యాలు కల్పించినట్టు స్పష్టం చేశాయి.

‘నాకు మధుమేహం లెవల్స్‌ పెరగడంతో.. రోజు నాలుగు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకుంటాను. జైల్లో ఉన్న నేను ఇన్సులిన్‌ తీసుకోకపోతే కిడ్నీలు పాడైపోయి చనిపోయేలా వాళ్లు (భాజాపాను ఉద్దేశిస్తూ) కుట్రలు పన్నారు. మీ అందరి ఆశీస్సులతో నేను బయటకు వచ్చాను. గత 10 ఏళ్లలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను అడ్డంపెట్టుకుని దిల్లీలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఆపేందుకు ప్రయత్నించారు. కానీ, నేను వారి ప్రయత్నాలను తిప్పికొట్టాను. దిల్లీలో పనులు ఎందుకు ఆపాలనుకుంటున్నారు?. పంజాబ్‌లో మా పార్టీ విజయం సాధించాక.. దిల్లీలో పనులు ఆపకపోతే దేశవ్యాప్తంగా ఆప్‌ అధికారంలోకి వస్తుందని భయపడుతున్నారు. నేను జైల్లో ఉండగా దిల్లీ అభివృద్ధి పనులు ఆపేశారు. తిరిగి నేను జైలు నుంచి వచ్చాక మా పార్టీ వాటిని ప్రారంభించింది’ అని ఆయన పేర్కొన్నారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ దిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్‌ లేఖ రాశారు.