Thursday, October 31, 2024
Homeజాతీయంఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Date:

దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యంపై కేంద్రంతో పాటు పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మండిపడింది. పొరుగు రాష్ట్రాల్లో చెత్తను తగులుబెడుతుండడంతో ఢిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సవరణలతో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని కోరల్లేనిదానిగా మార్చారంటూ ఘాటుగా స్పందించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం శిక్షాస్పదమైన చర్యలు చేపట్టడం లేదని.. కేవలం నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. పది రోజుల్లో నిబంధనలు ఖరారు చేస్తామన్నారు. చట్టం పూర్తిగా అమలులోకి తీసుకువస్తామని జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా ధర్మాసనానికి హామీ ఇచ్చారు.