Wednesday, January 15, 2025
HomeUncategorizedటికెట్ ఇవ్వ‌లేద‌ని ఏడ్చిన మాజీ ఎమ్మెల్యే

టికెట్ ఇవ్వ‌లేద‌ని ఏడ్చిన మాజీ ఎమ్మెల్యే

Date:

హ‌ర్యానాలో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లయింది. రాష్ట్రంలో అక్టోబ‌ర్ 5వ తేదీన అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీలు త‌మ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టిస్తున్నాయి. బీజేపీ కూడా త‌మ అభ్య‌ర్థుల జాబితాను బ‌య‌ట‌పెట్టింది. అయితే మాజీ ఎమ్మెల్యే శ‌శి రంజ‌న్ ప‌ర్మార్‌కు ఆ జాబితాలో చోటు ద‌క్క‌లేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీప‌డే అభ్య‌ర్థుల జాబితాలో పేరు లేక‌పోవ‌డంతో మాజీ ఎమ్మెల్యే శ‌శి రంజ‌న్ ఆవేద‌న‌కు గుర‌య్యారు. బివానీ లేదా తోషామ్ నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న భావించారు. జాబితాలో త‌న పేరు ఉంటుంద‌ని అనుకున్నాన‌ని ఆ మాజీ ఎమ్మెల్యే ఏడ్చేశారు. బాధ‌ను త‌ట్టుకోలేక క‌న్నీళ్లు రాల్చారు. ఎంత మంది వారించినా.. ఆయ‌న మాత్రం త‌న దుఖ్కాన్ని ఆపుకోలేక‌పోయారు. త‌న పేరును ప‌రిశీలన‌లో ఉంచార‌ని ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌చెప్పాన‌ని, కానీ ఇప్పుడు ఏం చేయాల‌ని, నిస్స‌హాయుడిగా మారిన‌ట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. అక్టోబ‌ర్ 8న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.