Sunday, December 22, 2024
Homeజాతీయంజమ్మూకశ్మీర్‌లో హింసకు వారే కారణం..

జమ్మూకశ్మీర్‌లో హింసకు వారే కారణం..

Date:

జమ్మూలో మూడు కుటుంబాల (గాంధీ, ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా కుటుంబం) హింసను ప్రేరేపించాయని, ఆ మూడు పార్టీల( కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ) వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లోని మెంధార్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈసందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 

ఈ ఎన్నికలు గాంధీ, ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా అనే మూడు కుటుంబాల పాలనను అంతం చేయబోతున్నాయని అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ మూడు కుటుంబాలే ఎన్నోఏళ్లుగా జమ్మూలో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే, జమ్మూకశ్మీర్‌లో ఎప్పటికీ పంచాయతీ లేదా బ్లాక్ స్థాయి ఎన్నికలు జరిగేవి కావని అన్నారు.

”1990ల్లో ఇక్కడి సోదరులు ధైర్యసాహసాలతో బుల్లెట్లను ఎదుర్కొన్నారు. 1947 నుంచి పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రతీ యుద్ధంలో సైనికులు జమ్మూ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షిస్తున్నారు” అని అమిత్‌షా సైనికుల త్యాగాలను కీర్తించారు.