ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గరియాబాద్ జిల్లా ఇందగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సొర్నామల్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోలు హతమయ్యారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఒడిశాలోని నవరంగపూర్కు చెందిన సైనికులు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు.