Tuesday, January 7, 2025
Homeజాతీయంకూలిన ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ హెలికాప్ట‌ర్‌

కూలిన ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ హెలికాప్ట‌ర్‌

Date:

ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్‌) కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగాయి. హెలికాప్టర్‌లోని ముగ్గురు సిబ్బంది ఈ ప్రమాదంలో మరణించారు. గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఈ సంఘటన జరిగింది. ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌కు చెందిన ధ్రువ్ హెలికాప్టర్‌ సాధారణ గస్తీ కోసం బయలుదేరింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోర్‌బందర్‌ సమీపంలోని గ్రౌండ్‌లో అది కూలిపోయింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ఎయిర్ ఎన్‌క్లేవ్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందులో ప్రయాణించిన సిబ్బందిలో ముగ్గురు మరణించినట్లు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. హెలికాప్టర్‌ కూలడానికి కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు హెలికాప్టర్‌ కూలిన తర్వాత మంటలు చెలరేగిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.