కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ (ఎం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కమ్యూనిస్టు యోధుడు సీతారామ్ ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కమ్యూనిస్టు శ్రేణులు ర్యాలీగా ఆయన భౌతిక కాయాన్ని ఎయిమ్స్‌కు తీసుకెళ్తున్నాయి. ర్యాలీలో ‘లాల్‌సలామ్ కామ్రేడ్’ నినాదాలు హోరెత్తుతున్నాయి.
సీతారామ్ ఏచూరి కోరిక మేరకు ఆయన కుటుంబసభ్యులు ఏచూరి భౌతిక కాయాన్ని మెడికల్ రిసెర్చ్ కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి దానం చేశారు. ఆ మేరకు ఆయన భౌతిక కాయాన్ని ఎయిమ్స్‌కు అప్పగించేందుకు తీసుకెళ్తున్నారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న సీతారామ్ ఏచూరి చికిత్స పొందుతూ ఈ నెల 12న తుదిశ్వాస విడిచారు. దాంతో బంధుమిత్రుల సందర్శనార్థం ఆయన నివాసంలో, కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు, అభిమానుల సందర్శనార్థం ఢిల్లీలోని సీపీఐ (ఎం) పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఇవాళ ఆయనకు కోరిక మేరకు ఎయిమ్స్‌కు భౌతిక కాయాన్ని అప్పగిస్తున్నారు.