Saturday, December 21, 2024
Homeజాతీయంఇక‌పై లింగ‌మార్పిడి ఇష్టారీతిన‌ కుద‌ర‌దు

ఇక‌పై లింగ‌మార్పిడి ఇష్టారీతిన‌ కుద‌ర‌దు

Date:

లింగ‌మార్పిడి ఇక‌పై ఇష్టారీతిన చేయించుకోవడం కుదరదు. లింగమార్పిడి, ప్రీ-హార్మోనల్‌ థెరపీకి ముందు మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌వోపీ) విడుదల చేసింది. ఎవరైనా ట్రాన్స్‌జెండర్‌ 18 ఏండ్ల లోపు లింగ నిర్ధారిత సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు ఏడాదిపాటు ఎండ్రోక్రైన్‌ చికిత్సపై స్థిరంగా ఉన్నట్టు సర్టిఫికెట్‌ తీసుకోవాలి.

ఈ మేరకు గైనకాలజిస్టులు, సైకాలజీ/సైకియాట్రిస్టులకు కూడా కొన్ని సూచలను చేసింది. సర్జరీ తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, పేషెంట్‌ పేరు, సర్వనామం పరంగా ఎలా సంబోధించాలనుకుంటున్నాడు వంటివి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని గైనకాలజిస్టులకు సూచించింది. అలాగే, ఎండోక్రినాలజీ పరీక్షకు ముందు సైకియాట్రిస్ట్‌ నుంచి ఒక సర్టిఫికెట్‌, లింగ నిర్ధారణ సర్జరీకి ముందు క్లినికల్‌ సైకాలజిస్ట్‌/సైకియాట్రిస్ట్‌ నుంచి మరో సర్టిఫికెట్‌ను ట్రాన్స్‌జెండర్లు సమర్పించాల్సి ఉంటుంది. వీరు పేషెంట్‌ మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్‌ అందజేస్తారు.