Sunday, December 22, 2024
Homeజాతీయంఅసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒంటరిగానే పోటీ

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒంటరిగానే పోటీ

Date:

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ ఎన్నికలకు అధికార పార్టీ ఆప్‌ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 31 మందిని ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. సొంత బలంతో ఎన్నికల్లో గెలుపొందుతుంది. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తుకూ అవకాశం లేదు’ అని కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌ సీట్ల పంపకం కోసం ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతోందంటూ వార్తలు వస్తున్నాయి. కూటమిలోని కాంగ్రెస్‌కు 15 సీట్లు, ఇతర పార్టీలకు ఒకటి లేదా రెండు సీట్లు కేటాయించినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన కేజ్రీ.. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా స్పష్టతనిచ్చారు.