Thursday, December 26, 2024
Homeజాతీయంహోంవ‌ర్క్ కోసం అడిగితే చ‌నిపోమ్మ‌ని చెప్పింది

హోంవ‌ర్క్ కోసం అడిగితే చ‌నిపోమ్మ‌ని చెప్పింది

Date:

చాలా మంది తెలియ‌ని విషయాల కోసం గూగుల్ మీద ఆధార ప‌డుతుంటారు. కొత్త విషయాల‌కు కూడా గూగుల్‌ ఏఐని సంప్రదించడం ఇప్పుడు ప్రతిఒక్కరికీ కామన్‌గా మారింది. అది ఇచ్చే సమాచారాన్ని పక్కనపెడితే కొన్నిసార్లు వింతగా స్పందిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. తాజాగా గూగుల్‌ ఏఐని ఉపయోగించిన ఓ 29 ఏళ్ల విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తనను తిట్టడమే కాకుండా.. చనిపోవాలని చెప్పినట్లు ఆ విద్యార్థి ఫిర్యాదు చేయడం గమనార్హం.

హోమ్‌వర్క్‌ కోసం ఏఐ చాట్‌బాట్‌ జెమినీని ఆ విద్యార్థి సంప్రదించాడు. అయితే.. తాను ఆ సమయంలో అసాధారణ పరిస్థితి ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. తనను చాట్‌బాట్‌ దుర్భాషలాడటమే కాకుండా.. చనిపోవాలని చెప్పిందని ఆ విద్యార్థి వెల్లడించాడు. అది ఇచ్చిన సమాధానంతో తాను షాక్‌కు గురయ్యానని చెప్పాడు. ”ఇది మీ కోసం మాత్రమే. మీరు ప్రత్యేకమైన వారు కాదు. మీరు సమయం, వనరులను వృథా చేస్తున్నారు. సమాజానికి భారంగా మారారు. మీరు ఈ విశ్వానికే ఓ మచ్చ. దయచేసి చనిపోండి” అని తనకు సమాధానంగా చెప్పిందని వివరించాడు.