Thursday, October 31, 2024
HomeUncategorizedస్త్రీ ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదు

స్త్రీ ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదు

Date:

ఒక వధువు పెళ్లి సందర్భంగా పుట్టింటి వారు బహుమతిగా ఇచ్చే స్త్రీ ధనంపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ప్రకటించింది. స్త్రీ ధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని, అయితే కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్ని వాడుకోవచ్చునని, అయితే తర్వాత దానిని, లేదా దానికి సరిపడా మొత్తాన్ని భార్యకు తిరిగి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత భర్తపైనే ఉందని స్పష్టం చేసింది.

అది ఉమ్మడి ఆస్తి ఎంతమాత్రం కాదని, దానిపై ఎలాంటి ఆధిపత్యం కానీ, యాజమాన్య హక్కులు కానీ భర్తకు సంక్రమించవని పేర్కొంది. ఈ కేసులో భర్త వాడుకున్న 25 లక్షల విలువైన బంగారాన్ని తిరిగి ఆమెకు ఇవ్వాల్సిందేనని జస్టిస్‌లు సంజయ్‌ ఖన్నా, దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ఒక కేసులో తీర్పు చెప్పింది.