లోక్ సభలో ఉద్యోగాల గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి అని గూగుల్ లో కూడా తెగ వెతికేస్తున్నారు. అయితే లోక్ సభలో ఉద్యోగం పొందవచ్చా? ఎలాంటి పోస్టులు ఉంటాయ్, ఎలా దరఖాస్తు చేసుకోవచ్చనే వివరాలు ఇప్పుడు చూద్దాం. లోక్‌సభలో ఉద్యోగాలు లేదా లోక్ సభ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన సమాచారం పార్లమెంటు వెబ్‌సైట్, sansad.inలో ఇవ్వబడుతుంది.
పార్లమెంటరీ వ్యాఖ్యాత
మీకు ప్రాంతీయ భాషలపై అవగాహన ఉంటే పార్లమెంటరీ వ్యాఖ్యాత ఉద్యోగం మీకు బెస్ట్. మీ భాషా పరిజ్ఞానం ఆధారంగా మీరు పార్లమెంటులో ఉద్యోగం పొందవచ్చు. ఈ ఖాళీల ద్వారా అస్సామీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, నేపాలీ, ఒరియా, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి భాషలకు వ్యాఖ్యాతల పోస్టులను నియమిస్తారు. ప్రాంతీయ భాషను జాతీయ లేదా అధికారిక భాషలోకి అనువదించడం వారి పని.
అనువాదకులు
పార్లమెంటులో ట్రాన్స్ లేటర్స్(అనువాదకులు) కూడా నియమిస్తారు. దీని కోసం అర్హతగల అభ్యర్థికి హిందీ, ఇంగ్లీష్ తో పాటు మరే ఇతర భాషపైనా మంచి పట్టు ఉండాలి. మూడు భాషల్లో అభ్యర్థికి రాయడం, చదవడం, అర్థం చేసుకోవడం,మాట్లాడటంపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి. ఇందుకోసం సంబంధిత భాషలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా వంటి కొన్ని విద్యార్హతలను నిర్దేశించారు. మీరు స్కూల్- స్థాయిలో ఏదైనా విదేశీ భాష నేర్చుకున్నట్లయితే, మీరు దానిలో డిప్లొమా పొందవచ్చు.
రిపోర్టర్
లోక్‌సభ సెక్రటేరియట్‌లో రిపోర్టర్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. దీని కోసం, అర్హులైన అభ్యర్థుల పరీక్షను మూడు స్థాయిలలో తీసుకుంటారు. ఇందులో షార్ట్‌హ్యాండ్ పరీక్ష, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉన్నాయి. ఈ మూడు దశల్లో విజయం సాధించిన అభ్యర్థికి మాత్రమే పార్లమెంట్‌లో రిపోర్టర్‌గా అవకాశం లభిస్తుంది. పార్లమెంటరీ రిపోర్టర్ ఉద్యోగం పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా హిందీ లేదా ఇంగ్లీష్ లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. పార్లమెంటరీ రిపోర్టర్ జీతం రూ.56,100 నుంచి రూ.1,77,500 మధ్య ఉంటుంది.
ఇతర పోస్ట్‌లు
పైన తెలిపిన పోస్ట్‌లు మాత్రమే కాకుండా లోక్‌సభలో రిక్రూట్‌మెంట్ జరిగే అనేక పోస్టులు ఉన్నాయి.. – కన్సల్టెంట్ ఇంటర్‌ప్రెటర్, కన్సల్టెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్, సీనియర్ కంటెంట్ రైటర్, మీడియా అనలిస్ట్, జూనియర్ కంటెంట్ రైటర్, మేనేజర్ మొదలైనవి. అధికారిక వెబ్‌సైట్ sansad.inలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు జారీ చేయబడతాయి. మీరు వెబ్‌సైట్‌లోని రిక్రూట్‌మెంట్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌లను చెక్ చేయవచ్చు.