Thursday, October 31, 2024
HomeUncategorizedరాహుల్ కుట్టిన బూట్లకు భారీ డిమాండ్

రాహుల్ కుట్టిన బూట్లకు భారీ డిమాండ్

Date:

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ శివారులోని విధాయక్‌ నగర్‌లోని ఓ చెప్పుల దుకాణానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనతో చాలా సేపు మాట్లాడారు. ఆయన చెబుతుంటే ఓ ‘షూ’ కూడా కుట్టారు. దీంతో రామ్‌ చేత్‌ ఇమేజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. అటువైపుగా వెళ్తున్న వారంతా కారు ఆపి మరీ, ఆయన యోగక్షేమాలు అడుగుతున్నారు. సెల్ఫీలు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.

మరోవైపు రాహుల్‌ కుట్టిన ‘షూ’కి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఆయన వెళ్లిన వెంటనే ఒకరు ఫోన్‌ చేసి.. దానిని రూ.5 లక్షలకు విక్రయించాల్సిందిగా కోరారట. ఇంకొకరు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారట. మరొకరైతే.. ‘బ్యాగు నిండా డబ్బిస్తా.. ఇచ్చేయ్’ అన్నారట. అయితే, దానిని విక్రయించబోనని, రాహుల్‌కి గుర్తుగా తన వద్దే ఉంచుకుంటానని రామ్‌ చేత్‌ చెబుతున్నారు. మరోవైపు రాహుల్‌తో దిగిన ఫొటో వార్తాపత్రికల్లో వచ్చినప్పటి నుంచి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏమైనా సమస్యలుంటే చెప్పాలని స్థానిక అధికారులు వచ్చినట్టు ఆయన చెప్పారు. రాహుల్‌ ఆదేశాల మేరకు.. ఆ తర్వాతి రోజునే పార్టీ నేతలు రూ.10 లక్షల విలువైన చెప్పులు కుట్టే మిషన్‌ను ఆయనకు అందజేశారు. అయితే, తన ఇంటికి కరెంట్‌ సదుపాయం లేకపోవడంతో, కుమారుడి ఇంటి వద్ద పెట్టి చెప్పులు కుడుతున్నానని రామ్‌ చేత్‌ చెప్పుకొచ్చారు.