Monday, January 13, 2025
Homeజాతీయంరాజ‌స్థాన్ కోటాలో ఆగ‌ని ఆత్మ‌హ‌త్య‌లు

రాజ‌స్థాన్ కోటాలో ఆగ‌ని ఆత్మ‌హ‌త్య‌లు

Date:

రాజ‌స్థాన్ కోటా అంటేనే ఉన్న‌త చ‌దువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్ర‌సిద్దిగాంచింది. అలాంటిది ఇప్పుడు కోటాలో వ‌రుస ఆత్మ‌హ‌త్యలు ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. చ‌దువు ఒత్తిడి కార‌ణంగా ఇప్ప‌టికే పలువురు విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకోగా ఇప్పుడు తాజాగా మ‌రో విద్యార్థి ప్రాణాల‌ను తీసుకున్నాడు.

బీహార్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి జేఈఈ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాది కాలంగా తన తల్లితోపాటు కోటాలోని తలవండి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. అయితే, ఆదివారం రాత్రి డిన్నర్‌ చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు కోట డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ యోగేష్‌ శర్మ తెలిపారు. విద్యార్థిది ఆత్మహత్యా..? లేక సహజ మరణమా..? అనేది ఇంకా నిర్ధారించలేదు. అతడి గదిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని.. శవపరీక్ష తర్వాతే విద్యార్థి మరణానికి గల కారణాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇది 16వ ఘటన కావడం గమనార్హం. గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు సూసైడ్‌ చేసుకున్నారు.