Thursday, October 31, 2024
HomeUncategorizedరాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు రూ.2 కోట్ల వాచ్

రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు రూ.2 కోట్ల వాచ్

Date:

ప్రపంచంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్​ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌తో కలిసి అనంత్ శుక్రవారం ఏడడుగులు వేశాడు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు వచ్చిన బాలీవుడ్ నటులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు అనంత్ అంబానీ భారీ బహుమతిని ఇచ్చాడు.

తన వెడ్డింగ్‌కు హాజరైన అత్యంత సన్నిహితులకు అనంత్ అంబానీ ఖరీదైన వాచీలను గిఫ్ట్​గా ఇచ్చి సర్​ప్రైజ్ చేశారు. అడెమార్స్‌ పిగ్యుట్‌ బ్రాండ్‌కు చెందిన ఈ వాచీ ధర సుమారు రూ.1.5 కోటి- రూ.2 కోట్ల దాకా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ వాచీలు అందుకున్న వారిలో బాలీవుడ్ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్ తదితరులు ఉన్నారు. తన పెళ్లికి అనంత్ అంబానీ రూ.54 కోట్ల వాచీ ధరించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.