Wednesday, January 15, 2025
HomeUncategorizedరాజ‌కీయ పార్టీల‌కు దూరంగా ఉండాలి

రాజ‌కీయ పార్టీల‌కు దూరంగా ఉండాలి

Date:

రైతుల స‌మ‌స్య‌ల‌పై పంజాబ్‌, హ‌ర్యానా మ‌ధ్య ఉన్న శంభూ సరిహ‌ద్దు వ‌ద్ద నిర‌స‌న చేప‌డుతున్న రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు సుప్రీంకోర్టు సోమ‌వారం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ న‌వాబ్ సింగ్ ఆ క‌మిటీకి నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. జ‌స్టిస్ సూర్య కాంత్‌, ఉజ్వ‌ల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాస‌నం సోమ‌వారం ఆ కేసును విచారించింది. వారంలోగా ఆ క‌మిటీ తొలి స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

రాజ‌కీయ పార్టీల‌కు రైతులు దూరంగా ఉండాల‌ని సుప్రీంకోర్టు సూచించింది. శంభు స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉన్న బారికేడ్ల‌ను ద‌శ‌ల వారీగా తొల‌గించేందుకు సంబంధిత అధికారులు మీటింగ్‌ను ఏర్పాటు చేయాల‌ని సుప్రీం సూచించింది. ఢిల్లీలోకి ప్ర‌వేశించేందుకు చూసిన పంజాబ్ రైతుల‌ను శంభూ బోర్డ‌ర్ వ‌ద్ద అడ్డుకున్న విష‌యం తెలిసిందే. అమలు కాని వాగ్దానాల‌ను ప‌ట్టించుకోవ‌ద్దు అని కూడా రైతుల‌కు సుప్రీం సూచించింది. ప్ర‌త్యాత్నాయ ప్ర‌దేశాల‌కు త‌మ నిర‌స‌నల‌ను మార్చుకోవ‌చ్చు అని ఆందోళ‌న‌కారుల‌కు కోర్టు చెప్పింది. రైతుల ఆందోళ‌న‌ల‌ను రాజ‌కీయం చేయ‌వ‌ద్దు అని జ‌స్టిస్ కాంత్ పేర్కొన్నారు.