Saturday, December 21, 2024
Homeజాతీయంమూడు కుటుంబ పార్టీల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారు

మూడు కుటుంబ పార్టీల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారు

Date:

కాంగ్రెస్‌, ఎన్సీపీ, పీడీపీ ఈ మూడు కుటుంబ పార్టీలతో జమ్మూకశ్మీర్‌ ప్రజలు విసిగిపోయారని, అవినీతి, ఉద్యోగాల్లో వివక్షను ఈ ప్రాంత ప్రజలు కోరుకోవడం లేదని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. జమ్మూలో బిజెపి ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతానికి దూరంగా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల విలువ కాంగ్రెస్‌కు తెలియదంటూ ఆ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

”కాంగ్రెస్‌ హయాంలో సరిహద్దుల్లో కాల్పులు జరిగినప్పుడల్లా ఆ పార్టీ తెల్ల జెండాలను ఎగురవేసింది. కానీ, భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. భారత్‌ ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగింది. 2016 సెప్టెంబరు 28 రాత్రి సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగింది. శత్రువుల భూభాగంలోకి వెళ్లి దాడి చేయగలిగిన నవ భారత్‌ను నాడు ప్రపంచమంతా చూసింది. దేశ రక్షణ కోసం జవాన్లు చేసిన త్యాగం విలువ ఆ పార్టీకి తెలియదు. వారిని ఎన్నడూ గౌరవించలేదు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ సైనికులకు మాయమాటలు చెప్పింది. ‘వన్‌ ర్యాంక్‌, వన్‌ పెన్షన్‌’ ఇస్తామంటూ వారిని ఎదురుచూసేలా చేసింది” అని తీవ్ర ఆరోపణలు చేశారు.