భర్త నుంచి విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు తమ భర్తల నుంచి భరణం కోరవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 125 కింద మహిళందరికీ, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు ఈ హక్కు ఉంటుందని కోర్టు తెలిపింది. ముస్లిం మహిళలు ఈ సెక్షన్ కింద భర్తల నుంచి భరణం కోరుతూ పిటిషన్‌లు వేయవచ్చునని కోర్టు పేర్కొంది.
తన నుంచి విడాకులు తీసుకున్న భార్య భరణం కోరుతూ పిటిషన్ వేయడాన్ని సవాల్ చేస్తూ ఓ ముస్లిం భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన డైవోర్స్‌డ్ భార్య వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరాడు. అయితే సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ ముస్లిం మహిళకు భరణం కోరే హక్కు ఉన్నదని తెలిపింది. ఆమెకు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆ ముస్లిం భర్త పిటిషన్‌ను కొట్టివేసింది.