Thursday, October 31, 2024
HomeUncategorizedనిత్య పెళ్లి కూతురికి హెచ్‌ఐవీ పాజిటివ్‌

నిత్య పెళ్లి కూతురికి హెచ్‌ఐవీ పాజిటివ్‌

Date:

ఒక మహిళ దొంగ పెళ్లి చేసుకుని అర్థరాత్రి నగలు, నగదుతో పరారవుతుంది. పెండ్లి కొడుకులను నమ్మించి మోసం చేసిన నిత్య పెళ్లి కూతురికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వెంటనే అధికారులు ఆమెను గతంలో పెండ్లి చేసుకున్న పెండ్లి కొడుకుల కోసం వేట ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని యూఎస్‌ నగర్‌ జిల్లాకు చెందిన 20 ఏండ్ల మహిళ యూపీ, ఉత్తరాఖండ్‌లలో పెళ్లి పేరుతో పలువురిని మోసగించింది. మే 6న యూపీ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి ముజఫర్‌నగర్‌ జైలుకు తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేయగా, హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఆమె ఆ వ్యాధిని గతంలో ఎంతమందికి వ్యాపింపచేసిందోనని పాత పెండ్లి కొడుకుల కోసం యూపీ పోలీసులు వెతుకుతున్నారు.