Thursday, January 2, 2025
Homeజాతీయందేశంలో ప‌లు విమానాల‌కు బాంబు బెదిరింపులు

దేశంలో ప‌లు విమానాల‌కు బాంబు బెదిరింపులు

Date:

మూడు రోజులుగు భార‌త్‌కు చెందిన ప‌లు విమాన స‌ర్వీసుల‌కు 12 బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఆకాశ, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానాలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బెంగళూరుకు బయలుదేరిన ఆకాశ విమానాన్ని తిరిగి దిల్లీలో అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. మరోవైపు దాదాపు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముంబయి-దిల్లీ ఇండిగో విమానానికీ ఇదేవిధమైన బెదిరింపులు రావడంతో ఆ విమానాన్ని అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు.

ఆకాశ ఎయిర్‌లైన్స్‌ QP1335 విమానం 184 మంది ప్రయాణికులతో దిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాలని పైలట్‌కు ఆదేశాలు వెళ్లాయి. దీంతో వెంటనే దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆకాశ ఎయిర్‌లైన్స్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. అటు ముంబయి-దిల్లీ విమానం కూడా ఆహ్మదాబాద్‌లో సురక్షితంగా దిగినట్లు సదరు విమానయాన సంస్థ వెల్లడించింది. గడిచిన మూడు రోజులుగా అనేక విమానాలకు బాంబు బెదిరింపులు వస్తోన్న ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే అంశంపై చర్చించేందుకు పార్లమెంటరీ కమిటీ బుధవారం భేటీ అయ్యింది.