Thursday, October 31, 2024
HomeUncategorizedదేశంలో తొలి విడత సమరం ముగిసింది

దేశంలో తొలి విడత సమరం ముగిసింది

Date:

దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌ సమరం శుక్రవారం ముగిసింది. కొన్ని చోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5గంటల వరకు 59.7% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించారు. తొలి విడతలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

రాష్ట్రాల వారీగా పోలింగ్‌ శాతం

అండమాన్‌ నికోబార్‌దీవులు 56.87%, అరుణాచల్‌ప్రదేశ్‌ 64.91, అస్సాం 70.77, బిహార్‌ 46.32, ఛత్తీస్‌గఢ్‌63.41, జమ్మూకశ్మీర్‌ 65.08, లక్షద్వీప్‌ 59.02, మధ్యప్రదేశ్‌ 63.25, మహారాష్ట్ర 54.85, మణిపుర్‌ 68.62, మేఘాలయ 69.91, మిజోరం 53.96, నాగాలాండ్‌ 56.77, పుదుచ్ఛేరి 72.84, రాజస్థాన్‌ 50.27, సిక్కిం 68.06, తమిళనాడు 62.08, త్రిపుర 79.83, ఉత్తరప్రదేశ్‌ 57.54, ఉత్తరాఖండ్‌ 53.56, పశ్చిమబెంగాల్‌ 77.57 చొప్పున పోలింగ్ శాతం నమోదైంది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో 66.94శాతం, సిక్కింలో 67.95శాతం చొప్పున నమోదైనట్లు పేర్కొంది.