Thursday, October 31, 2024
HomeUncategorizedదేశంలో గణనీయంగా తగ్గిన హిందూ జనాభా

దేశంలో గణనీయంగా తగ్గిన హిందూ జనాభా

Date:

భారతదేశంలో హిందూ జనాభా గణనీయంగా తగ్గినట్లు ప్రధానికి చెందిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొన్నది. 1950 నుంచి 2015 వరకు హిందువుల జనాభా 7.81 శాతం పడిపోయినట్లు ఆ స్టడీలో తేల్చారు. భారత్‌లో హిందువుల జనాభా తగ్గుతూ ఉండగా, మరోవైపు బౌద్ద, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల జనాభా పెరుగుతూ పోయింది. ఇక పార్సీలు, జైనులు జనాభా కూడా తగ్గింది. సమీప మిత్ర దేశాల్లో మెజారిటీ మతస్తుల సంఖ్య పెరుగుతుండగా, భారత్‌లో మాత్రం ఆ జనాభా తగ్గినట్లు రిపోర్టులో తెలిపారు.

1950 సంవత్సరంలో భారత్‌లో హిందువుల జనాభా 84.68 శాతం ఉండగా, 2015 నాటికి ఆ సంఖ్య 78.06 శాతానికి చేరుకున్నట్లు రిపోర్టులో వెల్లడించారు. మరో వైపు గడిచిన 65 ఏళ్ల కాలంలో ముస్లిం జనాభా మాత్రం 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగిందని స్టడీలో పేర్కొన్నారు. మయన్మార్‌లో హిందువుల జనాభా పది శాతం పడిపోయింది. నేపాల్‌లో కూడా హిందువుల సంఖ్య 3.6 శాతం తగ్గినట్లు తెలిపారు.

భారత్‌లో మైనార్టీలకు రక్షణ పెరిగిందని, వాళ్లు ఇండియాలో సుఖంగా జీవిస్తున్నట్లు స్టడీలో వెల్లడించారు. ప్రభుత్వ విధానాలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక విధానాల వల్లే మెజారిటీ జనాభా తగ్గి, మైనార్టీ జనాభా పెరిగినట్లు అంచనా వేశారు. అయితే సమాజంలో భిన్నత్వాన్ని ప్రోత్సహించే రీతిలో ఇండియా ఉన్నట్లు స్టడీలో రచయితలు అభిప్రాయపడ్డారు.