Thursday, October 31, 2024
HomeUncategorizedదేశంలో కొత్త నేర చట్టాలను అమలు చేయకండి

దేశంలో కొత్త నేర చట్టాలను అమలు చేయకండి

Date:

దేశంలో కొత్త‌గా రూపొందించిన మూడు నేర చ‌ట్టాల అమ‌లును వాయిదా వేయాల‌ని కోరుతూ ప్ర‌ధాని మోదీకి బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ రాశారు. వాస్త‌వానికి జూలై ఒక‌టో తేదీ నుంచి కొత్త చ‌ట్టాలు అమ‌లులోకి రానున్నాయి. అయితే వాటి అమ‌లును వాయిదా వేయాల‌ని కోరూతూ దీదీ లేఖ రాశారు. కొత్త నేర చ‌ట్టాల‌ను వాయిదా వేయ‌డం వ‌లన‌.. పార్ల‌మెంట్‌లో ఆ చ‌ట్టాల‌ను స‌మీక్షించే అవ‌కాశం ఉంటుంద‌ని ఆమె త‌న లేఖ‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌తీయ న్యాయ సంహిత‌, భార‌తీయ నాగ‌రిక సుర‌క్షా సంహిత‌, భార‌తీయ సాక్ష్య చ‌ట్టాల‌ను కేంద్ర ప్ర‌భుత్వ ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే బ్రిటీష్ కాలం నాటి భార‌తీయ శిక్షా స్మృతి(ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర్‌, 1872 నాటిఇండియ‌న్ ఎవిడెన్స్ యాక్ట్ చ‌ట్టాల స్థానంలో కొత్త చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చారు. దేశ పౌరుల‌కు వేగ‌వంతంగా న్యాయం అందించాల‌న్న ఉద్దేశంతో ఆ కొత్త చ‌ట్టాల‌ను రూపొందించారు. న్యాయ వ్య‌వ‌స్థ‌ను, కోర్టు మేనేజ్మెంట్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు కొత్త చ‌ట్టాల‌ను త‌యారు చేశారు.