అత్యధిక ముప్పు స్థాయిలను ఇది సమర్థవంతంగా ఎదుర్కొనే తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను డీఆర్‌డీవో రూపొందించింది. ఐఐటీ-ఢిల్లీతో కలిసి వీటిని తయారు చేసినట్లు రక్షణ శాఖ బుధవారం వెల్లడించింది. దీని ముందు, వెనక ఉండే కవచాలు 360 డిగ్రీల రక్షణను అందజేస్తాయని వెల్లడించింది. డీఆర్‌డీవో, ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు సంయుక్తంగా ఈ తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను రూపొందించాయి. దీనికి ( అడ్వాన్స్‌డ్ బాలిస్టిక్ ఫర్ హైఎనర్జీ డిఫీట్ ) అని పేరు పెట్టారు. వీటిని ఐఐటీ దిల్లీలోని డీఆర్‌డీవో ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అభివృద్ధి చేశారు. దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని మూడు పరిశ్రమలకు బదిలీ చేసేందుకు ఈ కేంద్రం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ వెల్లడించింది.
8.2 కేజీలు, 9.5 కేజీల కనీస బరువుతో వివిధ బీఐఎస్ ప్రమాణాల మేరకు వీటిని రూపొందించినట్లు.. 360 డిగ్రీల రక్షణను అందించే ముందు, వెనక కవచాలు ఇవి కలిగి ఉంటాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ జాకెట్లను పాలిమర్లు, స్వదేశీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థాలు ఉపయోగించి తయారు చేసినట్లు తెలిపింది.