Friday, January 3, 2025
Homeజాతీయంతెలుగు రాష్ట్రాల‌కు రెండు వందే భార‌త్ రైళ్లు

తెలుగు రాష్ట్రాల‌కు రెండు వందే భార‌త్ రైళ్లు

Date:

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వినాయ‌క చ‌వితి న‌వ‌రాత్రి ఉత్స‌వాల సంధ‌ర్బంగా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు కానుక అందించారని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌తో తెలిపారు. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ – హైదరాబాద్, దుర్గ్ – విశాఖపట్టణం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. దిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కిషన్ రెడ్డి అన్నారు.

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రధాని మోడీ ఆపన్న హస్తం అందించారని కేంద్రమంత్రి తెలిపారు. ”70 ఏళ్లు దాటిన వారందరికీ రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించారు. పేద, ధనిక తేడా లేకుండా 6 కోట్ల మంది వయోవృద్ధులకు లబ్ధి చేకూరనుంది. వచ్చే రెండేళ్లలో ఈ పథకంపై రూ.3,437 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. తెలంగాణ నుంచి అదనంగా మరో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి జరగనుంది. 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులందరికీ.. ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఆయుష్మాన్ పరిధిలో ఉన్న కుటుంబాల్లోని 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అదనంగా ఏడాదికి రూ.5లక్షల టాప్-అప్ కవర్ ఇవ్వనుంది. కేంద్రం నిర్ణయంతో.. వయోవృద్ధుల్లో హర్షం నెలకొంది. వయోవృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు” అని కిషన్‌రెడ్డి తెలిపారు.