Thursday, December 26, 2024
Homeజాతీయంతుపాకుల‌తో ద‌ద్ద‌రిల్లిన దండ‌కారణ్యం

తుపాకుల‌తో ద‌ద్ద‌రిల్లిన దండ‌కారణ్యం

Date:

ఛత్తీస్‌ఘడ్ దండ‌కార‌ణ్యంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి.ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

10 మంది మావోయిస్టులు హతం..

మావోయిస్టులకు అడ్డాగా ఉన్న చత్తీస్ ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది.శుక్రవారం ఉదయం మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. కాల్పులు జరుపుతున్న మావోయిస్టులను మట్టుబెట్టేందుకు బలగాలు మోహరించాయి.

అడవిలో జల్లెడ..

ఈఘటనకు ముందే అంటే గురువారం అర్ధరాత్రి ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు ఇద్దరు గిరిజనుల్ని నరికి చంపారు. పోలీస్ ఇన్‌ఫార్మర్స్ నెపంతో హత్య చేసినట్లుగా ఓ లేఖను కూడా వదిలివెళ్లారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే వాజేడుకు సరిహద్దున ఉన్న చత్తీస్ ఘడ్‌లో ఇంత పెద్ద బారీ ఎన్ కౌంటర్ జరగడంతో భద్రత దళాలు మరింత అప్రమత్తం అయ్యాయి. ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి.