Thursday, October 31, 2024
HomeUncategorizedతీహార్ జైల్లో కవితను కలిసిన హరీష్ రావు

తీహార్ జైల్లో కవితను కలిసిన హరీష్ రావు

Date:

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితను శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీష్ రావు ములాఖత్ అయ్యారు. ఆమె యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను కవిత ఎదుర్కొంటోన్నారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన అయ్యారు. జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై 3వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. ఆ తరువాత ఆమెను ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెడతారు ఈడీ అధికారులు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున కస్టడీని మరి కొంతకాలం పొడిగించాలని కోరే అవకాశాలు లేకపోలేదు.