Thursday, January 2, 2025
Homeజాతీయంఢిల్లీలో అధ్వాన్న స్థితిలో గాలి నాణ్య‌త‌

ఢిల్లీలో అధ్వాన్న స్థితిలో గాలి నాణ్య‌త‌

Date:

ఢిల్లీలో గాలి నాణ్యత అధ్వాన స్థితికి చేరింది. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ఏక్యూఐ 300కి పడిపోయింది. అనేక ప్రాంతాల్లో 300కి పైనే నమోదైనట్లు కాలుష్య నియంత్రణ మండ‌లి తెలిపింది. ఆనంద్‌ విహార్‌లో 351, బవానాలో 319, అశోక్‌ విహార్‌ ప్రాంతంలో 351, వాజీపూర్‌లో 327గా ఏక్యూఐ నమోదైంది. ఇక అయా నగర్‌లో 290, ఐటీవో వద్ద 284గా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ నమోదైనట్లు సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ తెలిపింది. గాలి నాణ్యత పడిపోవడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగా.. కాళింది కుంజ్‌లోని యమునా నదిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. నదిలో విషపూరితమైన నురగ తేలుతూ కనిపిస్తోంది.

ఈ మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంతో ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. దీనికి తోడు పొగమంచు కూడా రాజధాని ప్రాంతాన్ని ఆవహిస్తోంది. దీంతో నగరంలో రోజురోజుకూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధ్వానస్థితికి చేరుకుంటున్నట్లు కాలుష్య నియంత్రణ మండ‌లి పేర్కొంది.