Friday, January 3, 2025
Homeజాతీయంజైళ్ల‌లో కుల వివ‌క్ష‌పై సుప్రీం ఆగ్ర‌హం

జైళ్ల‌లో కుల వివ‌క్ష‌పై సుప్రీం ఆగ్ర‌హం

Date:

శిక్ష ప‌డ్డ ఖైదీలు అంద‌రూ జైలులో స‌మాన‌మేన‌ని, కొన్ని జైళ్ల‌లో జ‌రుగుతున్న కుల వివ‌క్ష ప‌ట్ల సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఖైదీల‌ను కుల‌వివ‌క్ష ఆధారంగా వేరుగా చూడ‌రాద‌ని కోర్టు చెప్పింది. అన్ని కులాల‌కు చెందిన ఖైదీల‌ను మాన‌వ‌త్వంతో, స‌మానంగా చూడాల‌ని కోర్టు తెలిపింది. జైళ్ల‌లో ఉన్న ఖైదీలకు ప‌ని విష‌యంలో స‌మాన హ‌క్కు క‌ల్పించాల‌ని కోర్టు వెల్ల‌డించింది. ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఉండే సీవేజ్ ట్యాంక్‌ల‌ను ఖైదీలు శుభ్రం చేసే అనుమ‌తి ఇవ్వ‌కూడ‌ద‌ని కోర్టు చెప్పింది. రాష్ట్ర జైలు మాన్యువ‌ల్స్‌లో ఉన్న అభ్యంత‌ర‌క‌ర రూల్స్‌ను కోర్టు కొట్టిపారేసింది. మూడు నెల‌ల్లోగా ఆ నియ‌మావ‌ళిని స‌వ‌రించాల‌ని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ కులానికి చెందిన వ్య‌క్తుల‌నే స్వీప‌ర్లుగా ఎంపిక చేయ‌డం స‌రైన విష‌యం కాదు అని కోర్టు చెప్పింది.