Wednesday, January 15, 2025
HomeUncategorizedక‌విత జైల్లో 11కిలోల బ‌రువు తగ్గారు..

క‌విత జైల్లో 11కిలోల బ‌రువు తగ్గారు..

Date:

ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. పలు మార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు లభించలేదు. తాజాగా ఆప్ నేత సిసోడియా కు సుప్రీంకోర్టు కండీషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసారు. ఇదే సమయంలో కవిత బెయిల్ కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి..బెయిల్ పైన సోదరుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి కవిత జైలు జీవితం పైన ఆవేదన వ్యక్తం చేసారు. తాజాగా హరీష్ తో పాటుగా కేటీఆర్ తీహార్ జైలులో కవితను పరామర్శించారు. కవిత గురించి స్పందిస్తూ కేటీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు. కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ఇప్పటి వరకు 11 కిలోలు తగ్గారని, బీపీ వచ్చిందని పేర్కొన్నారు. దాని వల్ల రోజూ రెండు టాబ్లెట్స్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ వివరించారు. తాజాగా జైలులో అస్వస్థతకు గురైన కవితకు చికిత్స అందించారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ అంశంపై ఆలోచించి మాట్లాడాలన్నారు. దేశంలో పొలిటికల్‌గా కోట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవని చెప్పుకొచ్చారు. బెయిల్ కోసం నిన్న అప్పీల్ చేశామని, వచ్చే వారంలో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జైల్లో ఖైదీలు 11 వేలు ఉండాల్సిన చోట 30 వేలు మంది ఉన్నారన్నారు. జైలు పరిశుభ్రంగా లేదన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు భవిష్యత్‌లో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.