Thursday, October 31, 2024
HomeUncategorizedఅంకితకు ₹5లక్షల చెక్కు ఇచ్చిన డీకే శివకుమార్‌

అంకితకు ₹5లక్షల చెక్కు ఇచ్చిన డీకే శివకుమార్‌

Date:

625/625 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకుతో మెరిసిన బాగల్‌కోట్‌ జిల్లా ముధోల్‌కు చెందిన అంకిత బసప్పను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తదుపరి చదువు కోసం రూ.5 లక్షల చెక్కును అందజేశారు. మరో ర్యాంకర్‌, మాండ్యకు చెందిన నవనీత్‌ అనే బాలుడిని సన్మానించి రూ.2 లక్షలు ఇచ్చారు. కర్ణాటకలో ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అసమాన ప్రతిభ చాటిన పలువురు విద్యార్థులను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సన్మానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అంకిత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను డీకేఎస్‌ అభినందించారు. మిగతా పిల్లలు కూడా ఇలాగే చదివి తమ పాఠశాలలకు, గురువులు, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా సూచించారు. పదో తరగతి ఫలితాల్లో 100శాతం మార్కులు సాధించిన అంకితను సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు సైతం ప్రశంసించారు.