సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలే ప్రధాన అంశంగా వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న మైక్రో ఫిల్మ్ పోస్టర్‌ను చంచల్‌గూడ జైలు సూపరిండెంటెంట్ శివకుమార్ గౌడ్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి, మీడియా కార్యదర్శి జయరాం సోమవారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒంటరి మహిళల పైన అఘాయిత్యాలు చేసే వాళ్ళ మైండ్ సెట్ మారాలని, ఆడవారిని గౌరవించడం పాఠశాల దశనుండే అలవర్చాలని అన్నారు. ఒక మహిళా వైద్యురాలికి జరిగిన అఘాయిత్యంపై లఘు చిత్రం నిర్మించడం ద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నారని తెలిపారు. చిత్ర దర్శకులు, నిర్మాత శివ నాగరాజ్, కొమటి రమేష్‌బాబు మాట్లాడుతూ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఈ నెలాఖరుకల్లా ఈ లఘు చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ చిత్రంలో నటిగా హేమ, యూట్యూబ్ నటులు ఆర్యన్ వర్మ, దినేష్, క్రేజీ బాయ్స్ సాయి నటించగా కేతన్, నవీన్ కుమార్, మణికంఠ, హర్ష భరద్వాజ్ జాఫర్, వంశీ కృష్ణ సాంకేతిక సహకారం అందించారు.