Thursday, January 2, 2025
Homeసినిమాసినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారు

సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారు

Date:

భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారని ప్రముఖ నటి సుహాసిని కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు ఏవిధంగా మారిందో చెప్పారు. హీరోలకు స్ట్రాంగ్‌ రోల్స్‌ రాస్తున్నారని.. హీరోయిన్స్‌కు మాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తున్నారని తెలిపారు. కమర్షియల్‌ చిత్రాలకు సంబంధించి 2010 నుంచి ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఇదే ఇంటర్వ్యూలో ఆమె తన భర్త మణిరత్నం గురించి మాట్లాడారు. ”మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇష్టాలు, అభిప్రాయాలు, వృత్తి.. ఇలా ప్రతి విషయంలో పరస్పరం గౌరవించుకుంటాం. మా మధ్య పెద్దగా గొడవలు జరగవు. చిన్న మనస్పర్థలు వచ్చినా సర్దుకుపోతుంటాం. ఆయన సినిమాలకు నేను వర్క్ చేస్తుంటా. ‘రోజా’, ‘తిరుడా తిరుడా’, ‘ఇరువర్‌’, ‘రావణ’ చిత్రాలకు డైలాగ్‌ రైటర్‌గా పనిచేశా” అని చెప్పారు.