పెరిగిన వాతావరణం.. చుట్టుప్రక్కల ప్రజల సమస్యలు.. కనీస సదుపాయాల లేని దీనుల బాధలు.. వీరందరి కోసం ఏదో చేయాలి.. ప్రభుత్వాలు ప్రజల కోసం, పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెపుతారు.. కాని పథకాలు అర్హులైన పేదలకే దక్కితే ఇంకా పేదరికం ఎందుకు ఉంటుంది.. అందుకే ఏదో ఒకటి చేయాలి.. తమ వంతు బాధ్యతగా సమాజానికి, కనీస అవసరాలు లేని పేదల కోస చిన్న సహాయం చేసినా చాలు అనుకుంది. అందుకే కన్న తండ్రి చేసే సహాయ, సహకారాలను స్పూర్తిగా తీసుకొని సేవా రంగం వైపు అడుగులు వేసింది డా. పిడమర్తి స్నిగ్థ.. ఆమె చేస్తున్న కార్యక్రమాలు, ఆమెను ముందుండి నడిపిస్తున్న వ్యక్తుల గురించి ముందడుగుతో చెప్పిన ముచ్చట్లు గురించి తెలుసుకుందాం..
ముందడుగు ప్రత్యేకం..
అమ్మా, నాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే.. వారి ఉద్యోగాలను సేవగా భావించే వారు. మేము ఇద్దరూ ఆడపిల్లలమైనా మమ్ముల సమాజ సేవకులుగానే పెంచారు. మనకు ఉన్నదాంట్లోనే మరొకరికి సాయం చేసే ఆలోచన ఉండాలనే స్పూర్తి మా నాన్న దగ్గరి నుంచి నేర్చుకున్నాను. అందుకే 2018 నుంచి సేవా కార్యక్రమాల్లో ముందడుగు వేశాను. మా స్వంత ప్రాంతమైన ఖమ్మం రూరల్ ప్రాంతాలలోని మహిళలకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ, కరోనా కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు, వ్యాధిపై అవగాహన, ప్రంట్‌లైన్ వారియర్స్‌గా 64మంది కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం జరిగింది. వాటితో పాటు యూత్ ఫర్ యాంటీ కరప్షన్, ముందడుగు పౌండేషన్, వీ ఫర్ ఉమెన్, హ్యూమన్ రైట్స్ ఉమెన్ ఎంఫవర్‌మెంట్ సెక్రటరీ సంస్థలలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాను.
*నా సేవకు వచ్చిన గుర్తింపు*
నేను చేసిన సామాజిక సేవ కార్యక్రమాలకు గాను నాకు రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నో అవార్డులు వరించాయి. ఫర్ పెక్ట్ ఉమెన్ అచీవర్స్ అవార్డు, సేవ్ ద గర్ల్ చైల్డ్, హ్యూమన్ రైట్స్, ఉమెన్ అచీవర్స్ అవార్డు, ఉమెన్ ఎంపవర్‌మెంట్ అవార్డు, బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు, వీ ఫర్ ఉమెన్ అవార్డు, టీచింగ్ ఎక్స్‌లెన్స్ అవార్డు, హెల్త్ ద డిజాబిలిటీ పురస్కారం, ఐరన్ లేడీ సర్టిఫికేషన్, యూనిసెఫ్ పురస్కారం, ఎడ్యుకేషనల్ అవార్డు, క్లినికల్ కాస్మోటాలజిస్టు అవార్డు, పర్మనెంట్ మేకప్ అర్టిస్టు అవార్డ్..
*తల్లిదండ్రుల సహాకారం*
ప్రతి పని, విజయం వెనుక తల్లిదండ్రుల సహాకారం ఉంది. నేను చేసే ప్రతి పనిని నాకన్నా ఎక్కువగా వారే నమ్ముతూ, అనునిత్యం ప్రోత్సాహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. మా డాడీ చిన్నప్పటి నుంచి యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఓన్ లైఫ్ అనే మాటలు స్కూల్ జీవితం నుంచి చెపుతూ ఉండేవారు. నా జీవితంలో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ప్రతి ఫెయిల్యూర్ అనే మరింత ధృడంగా మార్చాయి. నేను ఓడిన ప్రతిసారి మా తల్లిదండ్రులు నన్ను వెన్నుతట్టి ప్రోత్సాహిస్తూ వెనక్కి తగ్గకుండా ముందుకు సాగేలా ధైర్యాన్ని నింపేవారు. తల్లిదండ్రుల సపోర్టుతోనే నేను దేశ, విదేశాలకు సైతం వెళుతూ ఎన్నో విజయాలు సాధిస్తూ వచ్చాను. నా ప్రతి యొక్క మానసిక పరిస్థితిని నా తల్లిదండ్రులకు చెప్పుకునేలా నాతో ఒక స్నేహితుల్లా ఉన్నారు. నేను వెళ్లే ప్రతి కార్యక్రమానికి ఒక స్నేహితురాలిగా మా చెల్లి సహాకారం ఎల్లవేళలా ఉంటుంది.
*నా లక్ష్యం..*
చదువుకోవాలని తపన ఉండి, ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు నా వంతు బాధ్యతగా సహాయ, సహకారాలు అందిస్తాను. పారిశ్రామిక రంగాల్లో ఎక్కువశాతం పురుషులు ఉంటున్నారు కాని నేను ఒక మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తనలాంటి వాళ్లను మరో వందమందిని తయారు చేసే అవకాశం నాకు కలుగుతోంది. అందమనేది అందరి సొంతం, కాని డబ్బున్న కొంతమంది మరింత అందంగా తయారు అయ్యే అవకాశం ఉంటుంది. కాని తాను చేస్తున్న వృత్తిలో కొన్ని పాఠశాలల్లో, మురికివాడల్లో పరిశుభ్రతపై, అందంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తాను. అందం మనేది ఆడవారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వారిలో అభద్రతా భావాన్ని దూరం చేస్తోంది. బయటికి రాని ఎంతోమంది ఆడవాళ్ల సమస్యలకు నేను గొంతై వినిపిస్తాను..