15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedబాలికకు భరోసా కావాలి..

బాలికకు భరోసా కావాలి..

Date:

సమాజం వేగంగా పరుగులు పెడుతోంది.. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుస్తోంది.. టెక్నాలజీ వేగంగా రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది.. ఇది చూస్తున్న మనం అభివృద్దిలోకి దూసుకుపోతున్నామని అనుకుంటున్నాం.. కాని అదే టెక్నాలజీ మాటున విలువలు కనుమరుగవుతున్నాయి.. భార్యభర్తల బంధాలకు బీటలు బారుతున్నాయి.. కన్న కూతురు, కొడుకులే తల్లిదండ్రులను నడిరోడ్డుపై వదిలేస్తున్నారు.. వీరందరికి బంధాల విలువ, బాధ్యతల విలువ తెలియాలి.. వీటితో పాటు మహిళలు ఆర్థికంగా ఎదగాలి అనే భరోసా కావాలి.. తమ ప్రాంతంలో ఆ ఆలోచనతోనే కల్పిస్తూ ముందకు నడుస్తోంది వాణి.. వారు చేస్తున్న కార్యక్రమాలపై *వాణి ముందడుగుతో ముచ్చటించింది..*

ముందడుగు ప్రత్యేకం

అందరూ ఎదగాలి.. అందరూ అన్ని రంగాల్లో రాణించాలి.. మనిషి ఎదుగుదలకు చేయూత ఇవ్వాలి.. ఈ మాటలు వినడానికి, చెప్పడానికి చాలా బాగున్నాయి.. కాని ఆ మాటలు పాటించేవారు, అమలు పరిచేవారు మాత్రం కనబడరు.. ఎందుకంటే ఒక మనిషికి సహకారం, సహాయం అందించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఎవరికి వారు, యమునా తీరుగా ఆలోచిస్తే ఈ సమాజం ఏం కావాలి. అందుకే తమ వంతు ప్రయత్నంగా పలు కార్యక్రమాలు చేస్తున్నాను.

*మహిళలకు ఆర్థిక భద్రత*

ప్రతి మహిళ ఎవరిపై ఆధారపడకుండా ఎంతో, కొంత ఆర్థికంగా ఎదగాలి.. అప్పుడే స్వతంత్ర భావాలు అలవాటుపడుతాయి. 2006లో మహిళ సంఘంలో సభ్యురాలుగా ఆవిడ ప్రస్థానం మొదలెట్టాను. మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి పొదుపు చేస్తే వచ్చే లాభాలపై అవగాహన కల్గించాను. గ్రామ సంఘం లీడర్ గా, మహిళ సమాఖ్య నాయకురాలిగా పనిచేశాను. మహిళలకు సమస్యలు ఉంటే మహిళ సంఘం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేశాను. మహిళలకు సమాజంలోని వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఆర్థిక భరోసా ఇచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.

*బాలికలకు భరోసాగా..*

ఒక స్వచ్చంధ సంస్థలో పనిచేస్తున్నప్పుడు చదువుకు దూరమైన ఎంతోమంది పిల్లలను దగ్గరుండీ పాఠశాలలో చేర్పించాను. చిన్న చిన్న కారణాల వల్ల భార్యభర్తలు గొడవ పడితే కౌన్సిలింగ్ చేసి జీవితం అంటే ఏంటో వివరిస్తూ వారు సంతోషంగా జీవించే ప్రయత్నం చేశాను. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి గర్భవతిని చేసి మోసం చేస్తే అబ్బాయి ఇంటి ముందు ధర్నా చేసి అబ్బాయికి శిక్ష పడేలా చేశాను. చివరికి వారి ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి పెళ్లి జరిపించాము. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి..

బంధాల విలువపై అవగాహన*

మతిస్థిమితం లేకుండా రోడ్ల వెంబడి తిరుగుతున్న మహిళలను తీసుకొచ్చి ఆసుపత్రి చికిత్స చేపించి, రాష్ట్రంకాని రాష్ట్రంలో వారి స్వంత గ్రామాలకు తీసుకెళ్లి వదిలిపెట్టిన సంధర్భాలు ఉన్నాయి. ఓ కూతురు తన తల్లిని తీసుకొచ్చి నడిరోడ్డు మీద వదిలెస్తే కూతురిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లి గొప్పదనంపై వివరిస్తూ కూతురికి తల్లిని అప్పజెప్పాను. లంబాడీ తండాలలో అమ్మాయిల చదువును ప్రోత్సాహం ఇస్తూ, ఆర్థికంగా సహకారం చేసిన సంధర్బాలు ఉన్నాయి.. 2023 నుంచి బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాలలో ఆడపిల్లలకు సంబంధించిన చైల్డ్ మ్యారేజ్ చెయోద్దు. ఆడపిల్లలు చదివించాలనే కార్యక్రమాలు నిత్యం చేస్తున్నాను.

*వనితావాణి ఆసరాగా నిలవాలి*

స్వంతంగా ఒక సంస్థను ఏర్పాటు చేశాను. కాని ఇంకా పూర్తి స్థాయిలో కార్యక్రమాలు మొదలెట్టలేదు. అమ్మాయిలకు, మహిళలకు ఏ సమయంలో, ఏలాంటి సమస్యలు ఉన్న ముందుగా వారికి భద్రత కల్పించాలి. కుటుంబంలో ఎవ్వరూ లేని వారి కోసం అది పిల్లలైనా, పెద్దలైనా వారికి ఒక గూడు ఏర్పాటు చేయాలి.. వారికి తోడుగా ఉండాలి.. అందుకే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసే పనిలో ఉన్నాను. కుటుంబం సభ్యులు ఉన్న ఏ ఒక్కరూ రోడ్డు మీద ఉండొద్దు. సాధ్యమైనంత మేరకు ప్రతి మనిషికి బంధాల విలువ తెలిపే ప్రయత్నం చేయాలి. ప్రతి బాలిక చదువుకొవాలి. ప్రతి మహిళ తన స్వంత భర్తపై కూడా ఆధారపడకుండా ఆర్థికంగా ఎదగాలి.. ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలతో తన సంస్థ పూర్తి స్థాయిలో ముందుకు సాగనుందని వాణి అంటున్నారు.. వాణి చేస్తున్న, చేయబోయే కార్యక్రమాలకు ముందడుగు నుంచి ముందుగా హ్యాట్సాప్..