15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedతపన, సేవ, సహాయం @ పావని

తపన, సేవ, సహాయం @ పావని

Date:

సేవ చేయాలనే ఆలోచన మనసు నుంచి రావాలి.. ఎదుటి వారి కష్టాలను చూసి ఏలాగైనా సహాయం చేయాలని తపించాలి.. మన దగ్గర అవసరానికి డబ్బులు ఉన్నా, లేకున్నా.. ఆపదలో ఉన్నవారి కన్నీళ్లను తుడవాలని అనుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు..   సేవా కార్యక్రమాలకు సరిపడినంత ఆర్థిక వనరులు లేకున్నా, సమయానికి ఎవరో, ఒకరు  దాతలను సంప్రదించి వారి సపోర్టుతో కొంతమందికైనా అసరాగా నిలుస్తే చాలు అనుకునే వారు చాలా అరుదుగా కనిపిస్తారు.. అలాంటి రంగంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎంతోమందికి నేను ఉన్నానని తనకు తోచిన విధంగా సహాయ, సహకారాలు అందిస్తూ, తన వంతు బాధ్యతగా ముందుకు సాగుతోంది కరీంనగర్ జిల్లాకు చెందిన ఆదరణ సేవా సంస్థ పౌండర్ కర్రె పావని..

ముందడుగు ప్రత్యేకం..

సమాజం పట్ల ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు. కొంతమంది ఒంటరిగా తమకు తోచిన విధంగా సేవ చేస్తే, మరికొంతమంది ఒక గ్రూపుగా ఒక సంస్థను ఏర్పాటు చేసి సమాజం కోసం నిరంతరం పని చేస్తారు. తన కళ్ల ముందు ఎంతో మంది కనీస సదుపాయాలు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాలను కర్రే పావని నిరంతరం గమనిస్తూ ఉండేది. అలాంటివారికి ఏదో ఒక రకంగా సహకారం అందించాలని అనుకునేది. అలాంటి వారి కోసం 2020 ఫిబ్రవరిలో తన కుటుంబసభ్యుల సహకారంతో ఆద‌ర‌ణ సేవా స‌మితిని కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసింది కర్రె పావని. స‌హాయం కోసం ఎదురుచూస్తున్న అన్ని రంగాల వారికి వృద్దులకు, ఆనాధలు, వికలాంగులు, విద్యార్థులకు స‌హాయ‌, స‌హ‌కారాలు అందించాల‌నే ఆలోచ‌న‌తో తన సంస్థ ద్వారా ముందడుగు వేసింది.  

*అన్ని రంగాలవారికి సహకారం*

విక‌లాంగుల కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు, వ‌యోవృద్దుల‌కు దుప్ప‌ట్లు, స్వెట్ట‌ర్లు, అన్న‌దానం, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంగ‌న్‌వాడీ కేంద్రాల‌లో వాట‌ర్ పిల్ట‌ర్లు, ప‌ల‌క‌లు, ఆట వ‌స్తువులు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న విద్యార్ధుల‌కు ప‌రీక్ష‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ, ప‌రీక్ష‌ల ఫ్యాడ్స్‌, పెన్నులు, బుక్‌లు అందించారు. క‌రోనా స‌మ‌యంలో 700 కుటుంబాల‌కు నెల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌ర స‌రుకులతో పాటు మాస్క్‌లు అందించ‌డం జ‌రిగింది. వ‌ల‌స కార్మికుల‌కు బ‌ట్ట‌లు, చీర‌లు పంపిణీ. వృద్ధుల‌కు నైటీలు..మ‌హిళ‌ల‌కు రుతుక్ర‌మ అవ‌గాహ‌న క‌ల్పిస్తూ, శానిట‌రీ న్యాప్ కీన్స్ అందించారు. ఆనాధ‌శ్ర‌మాలు, వృద్దాశ్ర‌మాలు, అంధుల పాఠ‌శాల‌లో అన్న‌దానం కార్య‌క్ర‌మాలు నిర్వహించారు. ఇప్పటివరకు వివిధ ర‌క‌ర‌కాల సేవా కార్య‌క్ర‌మాలు 400పైగా చేసానని పావని అంటుంది.

*తోచిన సహాయం చెయ్యడంలోనే ఆనందం*

సమాజంలో మనవంతు బాధ్యతగా మనం కూడా మన కోసమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నవారికి ఎంతో, కొంత సహాయం చెయ్యాలి. ఎవరికీ వారే పట్టింపులేకుండా వ్యవహరిస్తే ఈ సమాజం ఏమైపోవాలి. అందుకే తాము ఒక సంస్థను ఏర్పాటు చేసి అన్ని రంగాల వారికీ, అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నాము. అది మా బాధ్యత అనుకుంటున్నాం. తమ సంస్థ నుండి నిరంతరం సహాయ, సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతాము. అవకాశం ఉన్నప్పుడు ఒకరికి సహాయ, సహకారం అందించడంలో ఉన్న తృప్తి మరి ఎందులో లేదు. అందుకే మా సంస్థ ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.