15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedగిరిజనుల బతుకుల్లో వెలుగులు

గిరిజనుల బతుకుల్లో వెలుగులు

Date:

అరచేతిలోకి ఫోన్ వచ్చింది.. ప్రపంచమంతా కనిపిస్తోంది.. అంతా బాగానే ఉంది, అభివృద్ధిలోకి దూసుకుపోతున్నాం అనుకుంటున్నాం కానీ ఇప్పటికి కరెంట్ బల్బు తెలియని గ్రామాలు ఉన్నాయి.. సరియైన తిండి దొరకక ఆకులు, ఆలుమలు తినే ఏజెన్సీ గుడాలు ఉన్నాయి. బయటి సమాజంపై అవగాహన లేక ఇబ్బందులు పడే జీవితాలకు కొదవేలేదు. అలాంటి ఏజెన్సీ ప్రజల జీవితాల్లో చీరుదీపంగా వెలుగులు నింపే ప్రయత్నం చేస్తోంది దీపిక.. ఆవిడ ముందడుగుతో ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..

ఏజెన్సీ ప్రాంతంలోని చాలా గ్రామాల్లో ఇప్పటికి  కరెంటు, రోడ్లు సౌకర్యం ఉండదు. కొండల ప్రాంతంలో గుట్టల మీద వాళ్లు నివసిస్తుంటారు. వారికి ఎటువంటి వైద్యం కానీ, విద్య కానీ అందదు. గుట్టల నుంచి కిందకు దిగి వచ్చి ఐటీడీఏ గిరిజన పాఠశాలల్లో చదువుకోవాలి. గిరిజనులు అడవిని పోడు కొట్టుకొని జొన్నలు, వరి వారికి సరిపడా  ఆహారాన్ని పండించుకుని తింటూ ఉంటారు. అడవిలో దొరికే తేనెను సంతల్లో అమ్ముతూ జీవనం కొనసాగిస్తారు. గిరిజన ప్రజలకి ప్రోటీన్ ఫుడ్ లేక చాలా రక్తహీనతతో అనారోగ్యంగా ఉంటారు. అక్కడి పిల్లల భవిష్యత్తు కోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అవగాహన క్యాంప్స్ ఏర్పాటు చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన మహిళగా పుట్టినందుకు నా గిరిజన ప్రజలకు నేను ఏదైనా నా వంతు కృషి చేస్తున్నాను.

*16పైగా ఏజెన్సీ గ్రామాల్లో కార్యక్రమాలు*

గత నాలుగు సంవత్సరాల నుండి ఇప్పటివరకు దాదాపు 16 పైగా ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనులకు, గిరిజన యువత, పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. కొత్తూరు, ఏడుగురాళ్లపల్లి,  పేగ,  కాటుక పల్లి, కూనవరం, విఆర్ పురం, కన్నాయిగూడెం,  కుటూరు,  చిమిలి వాగు, గబ్బిలాల గొంది, కర్మన్ కొండ, ఏరువాడ, చింతూరు, ఎటపాక, రాజుపేట, ఎర్రగుంట, పాకల, తులసి పాకతో పాటు ఎన్నో గ్రామాలు తిరుగుతూ వారిని నిరంతరం చైతన్యం చేస్తున్నాను.

*గిరిజనుల కోసమే దీపం పౌండేషన్*

రెండు నెలల క్రితం దీపం ఫౌండేషన్ స్టార్ట్ చేశాను.  ఏజెన్సీ ప్రాంతంలో నా సేవలు ఎవరికి ఉందో అక్కడ ఖచ్చితంగా నేను వారికి సహాయం చేయడానికి ఇకనుంచి హండ్రెడ్ పర్సెంట్ మన సేవ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి అక్కడ ప్రజలకి వాళ్ళ అవసరానికి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. మరి ముఖ్యమైన విషయం అంటే యువత నేనొక స్ఫూర్తిని అవ్వాలనుకుంటున్నాను. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కూడా లేదు నా లక్ష్యం ఏంటంటే అక్కడి నుంచి ఎందరో ఆఫీసర్స్ డ్రైవర్ ఏరియా నుంచి తీసుకురావాలి అనేదే నా ఆలోచన గత మూడు సంవత్సరాలుగా గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే పిల్లల్ని నేను ప్రోత్సహిస్తూ వారికి ఎన్నోసార్లు గ్రూప్ వన్ కి కావాల్సిన బుక్స్ ని నేను స్పాన్సర్ చేయడం జరిగింది. విద్యలో క్రీడా రంగంలో  ఏజెన్సీ ట్రైబల్ యువతకి మంచి బాసటగా  నిలవాలనుకుంటున్నాను.

*గిరిజన యువత అధికారులు కావాలి..*

కొందరి స్నేహితుల డాక్టర్స్ సహాయంతో వారందరికీ నేను మంచి హెల్త్ క్యాంప్స్ ని కండక్ట్ చేయిస్తున్నాను … ఎవరైతే బినామీల పేర్లలో ఆ రైతుల్ని ఆ గిరిజనులు మాయ మాటలు చెప్పి వారి భూముల్ని కబ్జా చేస్తూ అమాయక ప్రజలతో వారు ఆడుకుంటున్నారు వారందరికీ అవేర్నెస్ కలిగి చేసి వారి హక్కులని వారికి ఉన్నటువంటి అర్హతలు లేని వాళ్ళకి గుర్తించే విధంగా వాళ్ల కోసం నేను అవేర్నెస్ తీసుకురావడానికి ముందుకు వెళ్తాను. మరి ముఖ్యంగా యువత మత్తు పానీయాలకు బానిసలై చిన్న వయసులోనే దారి తప్పిపోతున్నటువంటి వారికి వెలుగులు నింపడానికి ఈ దీపం ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడానికి నేను ముందు ఉంటాను అంటున్నారు తుర్రం దీపిక..