కొంతమందికి చేయని తప్పుకు కూడా శిక్షలు పడి జైళ్లలో మగ్గిపోతున్నవారు ఉన్నారు. వారు నిర్ధోషిగా విడుదలయ్యే సమయానికి వారి వయస్సు దాటిపోతుంది. అలాంటిది జపాన్‌లో షిజుకా జిల్లాకు చెందిన పోలీసు బాస్.. ఓ నిర్దోషికి క్షమాపణలు చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే.. 1966లో ఓ మర్డర్ కేసులో ఐవా హకమడాను అరెస్టు చేశారు. 88 ఏళ్ల హకమాడాకు ఆ కేసులో నిజానికి మరణశిక్ష విధించారు. కానీ అతను ఆ కేసులో అత్యున్నత కోర్టును ఆశ్రయించడంతో మూడు దశాబ్ధాల పాటు వాదనలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ పునర్ దర్యాప్తుకు కోర్టు అంగీకరించింది. దీంతో 2014లో మళ్లీ అతనిపై ఉన్న కేసులో దర్యాప్తు చేపట్టారు. ఈసారి నిర్వహించిన విచారణలో హకమడా నిర్దోషిగా తేలాడు. సుమారు 58 ఏళ్ల జైలు శిక్ష తర్వాత అతన్ని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ మధ్యే ఇంటికి చేరుకున్న అతనికి ఆ జిల్లా పోలీసు చీఫ్ క్షమాపణలు చెప్పారు. విచారణలో పొరపాటు జరిగినట్లు తెలిపారు. మా వల్ల నీకు తీవ్రమైన మానసిక క్షోభ మిగిలిందని, అది మాటల్లో చెప్పలేమని, దానికి సారీ చెబుతున్నట్లు ఆ పోలీసు బాసు వెల్లడించారు.