Wednesday, December 25, 2024
Homeఅంతర్జాతీయంరైడింగ్ చేస్తూ బ్యూటీపుల్ బైకర్ మృతి

రైడింగ్ చేస్తూ బ్యూటీపుల్ బైకర్ మృతి

Date:

రష్యాకు చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ తత్యానా ఓజోలినా.. తుర్కియేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. తన ఎరుపురంగు బీఎండబ్ల్యూ బైక్‌పై ట్రావెలింగ్‌కు వెళ్లిన ఓజోలినా. తుర్కియేలోని మిలాస్‌ ప్రాంతంలో ద్విచక్రవాహనం నడుపుతూ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతిచెందగా.. వెనుక కూర్చున్న తుర్కియే బైకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఓజోలినా బైక్‌ నడుపుతుండగా.. మరో రైడింగ్‌ గ్రూప్‌ అడ్డుగా వచ్చిందని, దీంతో ఆమె సడెన్‌గా బ్రేక్‌ వేయడంతో ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

38ఏళ్ల ఓజోలినా ‘మోటోతాన్యా’ పేరుతో బైక్‌ రైడింగ్‌పై వ్లాగ్‌లు చేస్తూ సోషల్‌ మీడియాలో తెగ పాపులర్‌ అయ్యారు. ఆమె ఖాతాలకు ఇన్‌స్టాలో 10లక్షల మంది, యూట్యూబ్‌లో 20లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాహసోపేతమైన రైడింగ్‌లు చేసే ఈ ఇన్‌ప్లుయెన్సర్‌ను ‘రష్యా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ బైకర్’గా అభిమానులు పేర్కొంటారు. ఈమెకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.