Monday, December 23, 2024
Homeఅంతర్జాతీయంమహిళలు రెడ్ లిప్‌స్టిక్‌ వాడితే జైలుకే

మహిళలు రెడ్ లిప్‌స్టిక్‌ వాడితే జైలుకే

Date:

ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ అమలు చేసే ప్రతి రూల్ చాలా వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలపై కొత్త రకం నియమ నిబంధనలు విధిస్తారు. వాటిని పాటించలేక ప్రజలు నరకం అనుభవిస్తుంటారు. వేసుకునే దుస్తుల నుంచి హెయిర్ స్టైల్ వరకు ఈ దేశంలో అనేక కఠినమైన రూల్స్ అమల్లో ఉన్నాయి. ఇప్పటికే నార్త్ కొరియా అనేక పాపులర్ ఫ్యాషన్ బ్రాండ్లు, కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్‌ను బ్యాన్ చేసింది. అలాగే మహిళలు రెడ్ కలర్ లిప్‌స్టిక్ వాడకుండా నిషేధం విధించింది.

సాధారణంగా ఎర్రటి పెదవులతో అందంగా కనిపించాలని మగువలకు ఉంటుంది. కానీ ఉత్తర కొరియా మహిళలకు ఆ కల కలగానే మిగిలిపోతుంది. ఈ నియమాన్ని బ్రేక్ చేస్తే కిమ్ విధించే దారుణమైన శిక్షలకు బలి కావాల్సిందే.

* ఎందుకు బ్యాన్ చేశారు?

ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రెడ్ లిప్‌స్టిక్‌ మంచిది కాదని భావిస్తారు. అందుకే ఆ దేశంలో దాన్ని బ్యాన్ చేశారు. రెడ్ కలర్ స్వేచ్ఛను సూచిస్తుందని, రెడ్ లిప్‌స్టిక్ వాడే మహిళలు చాలా అందంగా కనిపిస్తారనేది కిమ్ అభిప్రాయం. అయితే స్వేచ్ఛ, మహిళల టెంప్టేషన్ రెండూ దేశానికి మంచివి కావని భావించిన కిమ్, ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను తమ దేశంలో బ్యాన్ చేశారు. సంప్రదాయ, నైతిక విలువలను కాపాడటానికి ఈ నిషేధం అవసరం అని ఆ దేశం నమ్ముతోంది. మహిళలు పొరపాటున రెడ్ లిప్‌స్టిక్‌ అప్లై చేసుకుంటే కఠినమైన శిక్షలు, భారీ పెనాల్టీలు విధిస్తారు.

* రూల్స్ బ్రేక్ చేస్తే?

ఉత్తర కొరియా మహిళలు చాలా సింపుల్ మేకప్‌ మాత్రమే వేసుకునే అవకాశం ఉంది. ఈ దేశం మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రజల వస్త్రధారణ, ప్రవర్తనలపై ఇప్పటికీ పాత కాలపు ఆలోచనలను ఫాలో అవుతోంది. అక్కడి ప్రభుత్వం మహిళల మేకప్ చెక్ చేయడానికి ప్రత్యేకంగా వర్కర్స్‌ను నియమించింది. ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ రూల్స్ పాటించేలా చూడటం వీరి బాధ్యత. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే పెద్ద ఇబ్బందుల్లో పడతారు. ప్రభుత్వం ప్రతి సిటిజన్ బాధ్యతగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇతర దేశాల ఫ్యాషన్ స్టైల్స్‌ వల్ల దేశ ప్రజలు ఇన్‌ఫ్లుయెన్స్‌ కాకుండా జాగ్రత్త పడుతుంది.

* హెయిర్ స్టైల్స్‌పై కూడా..

ఉత్తర కొరియాలో హెయిర్ స్టైల్స్‌పై కూడా కఠినమైన నియమాలు ఉన్నాయి. మహిళలకు పొడవాటి జుట్టు ఉండకూడదు లేదా డిఫరెంట్ స్టైల్స్ ఎంచుకోకూడదు. షార్ట్ హెయిర్‌తో మాత్రమే ఉండాలి. జుట్టును శుభ్రంగా, చక్కగా మెయింటెన్ చేయాలి. హెయిర్ కలర్స్ వేసుకోవడం కూడా ఇక్కడ ఒక పెద్ద నేరం. కిమ్‌ కొన్ని హెయిర్ స్టైల్స్‌కు మాత్రమే ఓకే చెప్పారు. పురుషులు 10, మహిళలు 18 హెయిర్ స్టైల్స్‌లో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చని కిమ్‌ ప్రకటించారు. ప్రజలు తప్పనిసరిగా ఈ హెయిర్ రూల్స్ పాటించాలి. లేదంటే శిక్ష అనుభవించక తప్పదు.